19, జులై 2013, శుక్రవారం

నా మెయిలు గోల

ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది.2012లో ఈ రోజే నేను మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకున్నా.ట్రిపుల్ ఐటీ సీటు వచ్చేక అక్కడ ల్యాపుటాపు మనకిచ్చేస్తారని అంతర్జాల సౌకర్యం కూడా ఉంటుందని తెలిశాక,ఎంచక్కా డాడీకి మెయిలు పెట్టుకోవచ్చని చేసుకున్నా.కానీ అక్కడికెళ్ళాక తెలిసిందేమిటంటే,జీమెయిల్ లాంటివి అక్కడ్ ఓపెన్ అవ్వవు అని.


సంక్రాంతికి వచ్చినపుడు,యూట్యూబ్లోనూ,గూగుల్ ప్లస్ లోనూ,సైన్ ఇన్ ఉంటుంది కదా.అది ఓపెన్ చేస్తే యూసర్ నేం,పాస్వర్డ్ అడుగుతుందని,నా మెయిల్ ఐడీ,పాస్వర్డ్ ఎంటర్ చేశా.అంతే,వాటిలో నా ఎకౌంట్ ఓపెన్ అయింది.గూగుల్ ప్లస్ అంటే ఫేస్ బుక్ లాంటిదని అప్పుడు అర్థమయింది.అందులో చాలా ఫోటోలు అప్లోడ్ చేశా.కొన్ని నాకు మాత్రమే కనబడేలాగా.

ఇక యూట్యూబ్ కొస్తే ఏదైనా వీడియో అప్లోడ్ చేద్దామంటే గంటలు గంటలు సమయం తీసుకుంటుంది.ఎందుకో నాకర్ధం కాలేదు.అలా కాకుండా నాదగ్గరున్న ఫోటోలతో ఒక స్లైడ్ షో తయారు చేసి,దానికి సంగీతం చేర్చి అప్లోడ్ చేసా.అది చాలా సులువుగా పూర్తయింది.


ఆ మెయిలు తోనే ఈ సంవత్సరం బ్లాగు ప్రారంభించా.

3 కామెంట్‌లు:

 1. బాగుంది మోహనా!నీ మెయిల్ కు happy birthday .తీరిక దొరికిందా ఏమిటి ?వరుసగా టపాలు వస్తున్నాయి .

  రిప్లయితొలగించండి
 2. మోహన గారు మీ బ్లాగ్ చూస్తుంటా .బాగుంటుంది . మీ ఫ్రెండ్ చిన్నాయగూడెం పక్కనే మాఉరు

  రిప్లయితొలగించండి
 3. మీ బ్లాగు " పూదండ" అగ్రిగేటర్ లో 'Blog of the Week' గా ఎన్నికైనది. ఈ వారం అంతా మీ బ్లాగు ప్రత్యేకంగా Display చేయబడుతుంది.

  శుభాకాంక్షలతో

  ----www.poodanda.blogspot.

  రిప్లయితొలగించండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...