|
Lawrence kim peek |
మా విశ్వవిద్యాలయం లో రోజూ ఇ-దినపత్రిక చదవడం నా అలవాటు.ఈనాడు,సాక్షి,ఆంధ్రజ్యోతి,హిందు చదువుతాను.ఒక రోజు ఆంధ్రజ్యోతి చదువుతున్నప్పుడు ఒక వార్త చాలా ఆశ్చర్యానికి గురిచేసింది.
అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో ఉండే "
లారెన్స్ కిం పీక్"కి విచిత్రమైన వ్యాధి ఉంది.అదే "మాక్రోసిఫిలీ".
"మాక్రోసిఫిలీ"--మెదడులోని రెండు భాగాల్ని కలిపి ఉంచాల్సిన నాడులు మెదడులో ఉండవు.మొత్తం ఒకటిగా కలిసి ఉండాల్సిన మెదడు,రెండుగా విడిపోయి ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా వ్యవహరిస్తుంది.దీన్నే "Split Brain Symdrome" అని కూడా అంటారు.దీని వల్ల ఆ వ్యాధి గ్రస్తునికి విపరీతమైన జ్ఞాపక శక్తి వస్తుంది.
మెదడులో "కార్పస్ కల్లోసం" ఉండదు,దాంతో మెదడులో రెండు భాగాల మధ్య భాషాపరమైన అనిసంధానం ఏర్పర్చుకునే లక్షణాన్ని స్వతహాగా మెదడే ఏర్పాటు చేసుకుంటుంది.దీని ఫలితంగా మెదడుకి వేగంగా చదవగలగటం,చదివింది గుర్తు పెట్టుకో గలిగే సామర్ధ్యం ఉంటుంది.
లారెన్స్ కిం పీక్ జీవితం ఆధారంగా 1988లో "Rainman" అనే సినిమాను కూడా తీశారు.
ఈ వ్యాధి బాగుంది కదా!!!
బాగుంది
రిప్లయితొలగించండి