4, జులై 2014, శుక్రవారం

నవంబరు నెల సైన్సు సంగతులు1-1919-విశ్వం పుట్టుకకు సంబంధించి "Steady state theory" ని ప్రతిపాదించిన గణిత 

శాస్త్రవేత్త "హెర్మన్ బాండి" జన్మదినం.2-1833-"Indian association for cultivation of science" సంస్థాపకులు "మహేంద్ర లాల్ 

సర్కార్" జన్మదినం.3-1957-"లైకా" అనే కుక్క అంతరిక్షయానం చేసిన "స్పుత్నిక్-2" ను అప్పటి రష్యా దేశం ఈ 

రోజునే ప్రయోగించింది.7-1867-"మేరీ క్యూరి" జన్మదినం.రేడియోథార్మికతకు సంబంధించి 1903లో భర్త "పియరీ 

క్యూరీ" మరియు "హెన్రీ బెకెరెల్" తో కలిసి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ని 


అందుకున్నారు."రేడియం","పోలోనియం" మూలకాలను ఆవిష్కరించినందుకు 1911లో 2వ 

సారి రసాయనశాస్త్రంలో నోబెల్ లభించింది.7-1888-"సర్ సి.వి.రామన్" పుట్టిన రోజు.8-1895-"Wilhelm Roentgen" X-కిరణాలను ఆవిష్కరించారు.


9-1904-పుష్పించే మొక్కలజు సంబంధించి విస్తృత పరిశోధనలు చేసిన భారతీయ వృక్ష శాస్త్రవేత్త 

"పంచానన్ మహేశ్వరి" జన్మదినం.12-1896-భారతదేశంలో పక్షులకు సంబంధించి ఆనేక పరిశోధనలు చేసి,బొంబాయిలో "నేచురల్

 హిస్టరీ సొసైటీ" ఏర్పడటానికి కృషి చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త "సలీం అలీ" జన్మదినం.14-1891-భారతీయ వృక్ష శాస్త్రవేత్త "బీర్బల్ సాహ్ని" జన్మదినం.15-1640-ఖగోళ శాస్త్రంలో అనేక పరిశోధనలు చేసి గ్రహగతులకు సంబంధించి కెప్లర్ గ్రహగమన

 సూత్రాలను నిర్వచించిన "జోహెన్నెస్ కెప్లర్" మరణించిన రోజు.16-1965-రష్యా మానవరహిత అంతరిక్ష నౌక "వెనీరా-3" శుక్రగ్రహం వైపు ప్రయాణించిన రోజు.18-1962-పరమాణు నిర్మాణానికి పరిశోధనలు చేసి,1922లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని

 పొందిన "నీల్స్ బోర్" మరణ దినం.20-1889-అమెరికా ఖగోళ శాస్త్రవేత్త "ఎడ్విన్ హబుల్" జన్మదినం.పాలపుంతలు,విశ్వ 

నిర్మాణానికి సంబంధించిన పరిశోధనలు చేశారు.21-1970-సర్ సి.వి.రామన్ మరణించిన రోజు.23-1937-"జగదీశ్ చంద్రబోస్" మరణదినం.24-1859-"ఆరిజన్ ఆఫ్ స్పిషీస్" ప్రచురించిన రోజు(చార్లెస్ డార్విన్).26-1885-కాస్మిక్ రేస్,కృత్రిమ రేడియో థార్మికతకు సంబంధించి పరిశోధనలు చేసిన "దేబేంద్ర 

మోహన్ బోస్" జన్మదినం.27-1971-రష్యా మానవరహిత అంతరిక్ష నౌక "మార్స్-2" కుజగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసింది.28-1954-థర్మల్ న్యూట్రాన్స్ పై పరిశోధన చేసి 1938లో నోబెల్ పొందిన అమెరికా భౌతిక శాస్త్రవేత్త

 "ఎన్రికో ఫెర్మి" మరణించిన రోజు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...