28, మే 2013, మంగళవారం

కొన్ని జ్ఞాపకాలు

మేము అక్కడ చేరేక మొదటి పండుగ వినాయక చవితి.ఆ రోజు కళాశాల ప్రాంగణమంతా చాలా సందడిగా ఉంది.ఆ రోజు మధ్యాహ్నం మాకు గబ్బర్ సింగ్ చిత్రం వేశారు.బయట వీధుల్లో వినాయక ప్రతిమ ను నిలబెట్టి దానికి పూజలు చేస్తారు కదా.అలాగే అక్కడ కూడా 3-4 ప్రతిమలను నిలబెట్టారు.మా స్నేహితులందరూ వాటిని దర్శించుకున్నాం.

తర్వాతి పండుగ దీపావళి.దీపావళికి కొద్దిరోజుల తర్వాతే సెమిస్టర్ పరీక్షలు.కానీ మేము పండుగ ను జరుపుకున్నాం.మా వార్డెన్ మా మదర్నీ పిలిచి పాటలు పాడించారు.మేము కొవ్వొత్తులు వెలిగించాము.దీపాలు ఉండవు కదా.కానీ ఆ రోజు చదువుకోవడానికి ఎక్కువ కేటాయించాము.

తర్వాత నూతన సంవత్సరం.అప్పుడు కూడా ముందు పరీక్షే.అదే నెల వరీ పరీక్ష.మేము మా వసతి గృహము ముందు రంగుల ముగ్గు వేశాము(నేను కాదు).ఆ రంగులు ఎలా వచ్చాయంటే మా గదిలో ఒక అమ్మాయి ఏదో పని మీద ఇంటికి వెళ్ళొచ్చింది.అపుడు తను తెచ్చిందన్నమాట.కొన్ని రంగుల రిబ్బనులు కొని గదిని అలంకరించాం.అర్ధరాత్రి పన్నెండు గంటలకి కేకు కట్ చేసి అందరూ పంచుకున్నాం.RGUKT లో ఉన్న అన్ని గదుల విద్యార్ధినులు గదికొకటి కేకు చొప్పున ఆర్డరిచ్చారంట.నూతన సంవత్సరం రోజున శెలవు కాదుకదా.ఆ రోజు కెమిస్ట్రీ సారు తప్ప ఎవరూ పాఠాలు బోధించలేదు.

ఒకసారి ముఖ్యమంత్రి  శ్రీకిరణ్ కుమార్ రెడ్డి గారు మా విశ్వవిద్యాలయానికి విచ్చేశారు.ఏదో పని మీద నూజివీడు వస్తే అలా వచ్చారు.4గంటలకే వస్తారని చెప్పి మమ్మలందర్నీ కూర్చీల్లో సర్దేశారు.ఎలాగో తెలుసా.రెండు కుర్చీల్లో ముగ్గురు కుర్చోవాలంట.అవి ఏమన్న పెద్ద కుర్చీలు కూడాకాదు.చిన్న కుర్చీలు.మా అవస్థ అంతాఇంతా కాదు.కాళ్ళు నొప్పులు పుట్టాయి.ఆయన ఎంతకీ రావట్లేదు.భోజనం ఆలస్యం అవుతుందని మమ్మల్ని భోజనాలకి పంపేశారు.మళ్ళీ తిరిగి వచ్చేసరికీ అసలు ఖాళీల్లేవు.అప్పుడు  ముందు లాగే సర్దుకు కుర్చున్నాం.ఇప్పుడు రెండు కుర్చీల్లో నలుగురు.CM గారు వచ్చేసరికీ ఎంత అయిందో తెలుసా.రాత్రి పావుతక్కువ పది.మమ్మల్ని అందరి కన్నా చివర్లో కుర్చోబెట్టారు.మేము అందరి కన్నా జూనియర్లు కదా.CM గారు మాకు కనిపించలేదు.ఇలాంటి కార్యక్రమాలు జరిగినపుడు పెద్దLCD తెరలు పెట్టారు.మేము అందులో చూశాము.అవి కూడా మాకు దగ్గర్లో లేవు.అసలు ఆయన వచ్చిన కార్యక్రమం ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముఖాముఖి.జరిగిందేమిటంటే కొంత మంది విద్యార్థులు కొన్ని ప్రశ్నలు ఆయన్ని వేశారు.ఆయన్ సమాధానం పొడిపొడిగా చెప్పడం.

మాకు అసలైన పండుగ ఏంటంటే మా విశ్వవిద్యాలయ వార్షికోత్సవం.ఐదేళ్ళైంది స్థాపించి.అందుకని జనవరి మొదటి వారంలో వార్షికోత్సవం జరిగింది.దాని పేరు Cygnus'13.చాలా ఈవెంట్లు నిర్వహించారు.రెండు రోజులు బాగా ఆనందించాం.చాలా మంది నృత్యం చేశారు.నాటకాలు వేశారు.ఆది,సోమవారాల్లో జరిగింది.ఆదివారం రాత్రి భొజనం చాలా ఆలస్యంగా చేసాం.మొత్తానికి వార్షికోత్సవం చాలా బాగా జరిగింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...