30, మే 2013, గురువారం

DD Saptagiri


ఇంచుమించు నా రెండవ తరగతి నుండే మేము DD Direct plus DTH Dish Tv ను వాడేవాళ్ళం.అప్పట్లో మాకు దూరదర్శన్ ఒక్కటే తెలుగు చానెల్ వచ్చేది.DTH free service కదా,డబ్బులు కట్టనవసరంలేదు.అప్పుడు DD8(సప్తగిరి) లో వచ్చే కార్యక్రమాలు(నాకు గుర్తున్నవి)మళ్ళి మళ్ళి పాడాలి ఈ పాట,సుందరీ సుబ్బారావు,సీతారామపురం అగ్రహారం,అనురాగధార,బంధాలు అనుబంధాలు,ఓ అమ్మ కథ.....

కానీ వాటి గురించి నాకు అంతగా తెలియదు.మళ్ళి మళ్ళి పాడాలి ఈ పాట మాత్రం చూసేదాన్ని.అందులో కొంతమంది ఆర్కెస్ట్రా వాళ్ళు సినిమా పాటలు పాడతారు.

DD Ditect plus లో సప్తగిరి తో పాటు TV9,Ntv,ABN andhrajyothi మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ వచ్చేవి.కానీ ఇప్పుడు రావట్లేదు.అది కాక ఈ DTH లో అన్ని భాషల దూరదర్శన్ చానెళ్ళు , ఇంకా ఒక 50 వరకూ ప్రైవేటు చానెళ్ళు,ఇంకో 50 రేడియో చానెళ్ళు వస్తాయి.విదేశీ చానెళ్ళు కూడా వస్తాయి.అవి NHK World(Japan),DWTv(Germany),Russia today(Russia).ఇందులో NHK చాలా బావుంటుంది.ఇవి ఇప్పటికీ వస్తున్నాయి కూడా.


సప్తగిరి సంచాలకులు డా.పాలకుర్తి మధుసూధన రావు గారు(5 సం|| క్రితం).ఇప్పటి సంచాలకులు మల్లాది శైలజా సుమన్ గారు.


ఒక 4-5 సంవత్సరాల క్రితం మువ్వల సవ్వడి అనే శాస్త్రీయ నృత్య కార్యక్రమం ప్రతీ ఆదివారం రాత్రి 8:30 ని.లకు వచ్చేది.అది చాలా బావుండేది,అందరి ఆదరణ పొందింది.నేనైతే అన్ని ఎపిసోడ్లు క్రమం తప్పకుండా చూశాను.ఆ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి,నర్తకి అయిన ప్రభ గారు వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు.దాని తర్వాత ప్రభగారి వ్యాఖ్యానం లోనే చిన్నారులతో ఒక కార్యక్రమం వచ్చేది.దాని పేరు నాకు అంత గుర్తు లేదు.ప్రతీ ఆదివారం రాత్రి 8:30 ని.లకు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం ప్రసారం అవుతుంది.మువ్వలసవ్వడి గురించి సౌమ్య గారు తన బ్లాగులో వ్రాశారు.
                 తర్వాత గానగాంధర్వం అనే సంగీత కార్యక్రమం వచ్చేది.దానికి వ్యాఖ్యాత ప్రముఖ గాయని గోపికా పూర్ణిమ.అది అయిపోయాక స్వరమాధురి అనే కార్యక్రమం వచ్చేది.అందులో ప్రముఖ విద్వాంసులు కచేరి చేస్తారు.దాని తర్వాత స్వరసమరం(వ్యాఖ్యాత గాయకుడు కృష్ణ చైతన్య),చిరుస్వర సమరం(చిన్నారుల కార్యక్రమం) వచ్చేవి.ఇవన్నీ అయిపోయాయి.ఇప్పుడు కొత్త కార్యక్రమం ప్రారంభిస్తున్నారు.దాని పేరు ఆలాపన.ఇదీ చిన్నారులదే.ఇది ఇంకా మొదలవలేదు.


ఆదివారం ఉదయం 11గంటలకు ఇంధ్రధనస్సు అనే బాలల కార్యక్రమం వచ్చేది.ఆ ప్రోగ్రాం చివర్లో ఒక వ్యక్తి గురించి ఒక వ్యాసం వ్రాసి పంపమనేవారు.దానికి నేను, మా చెల్లి వ్యాసాలు పంపిస్తే మంచి పుస్తకాలు పంపారు.

తెలుగు లో ఉన్న ప్రముఖ రచయితల కథలు,నవలలు సీరియల్స్ గా ప్రసారం చేసేది.విశనాధ సత్యనారాయణ గారి విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు మరియు వేయి పడగలు,గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం,కందుకూరి వీరేశలింగం గారి రాజశేఖర చరిత్ర,రావూరి భరధ్వాజ గారి జీవన సమరం,మన అమరావతి కథలు,మధురాంతకం రాజారాం కథలు,అడివి బాపిరాజు రచనలు....మొదలైనవి ప్రసారమయ్యేవి.


ప్రస్తుతం మధ్యాహ్నం 3గంటలకు తెలుగింటి అమ్మాయి కార్యక్రమం ప్రసారం అవుతుంది.అది రాత్రి 9:45ని.లకు పునఃప్రసారం అవుతుంది.వ్యాఖ్యాత చిత్రలేఖ.కార్యక్రమంలో నాలుగు ఆవృతాలు (రౌండ్స్)ఉంటాయి.అవి..

1. ముత్యాల లోగిలి
   
    కొన్ని సామాన్య విషయాలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతారు.ఒక్కొక్కరికీ ఒక్కో ప్రశ్న.దీని తర్వాత అభ్యర్ధుల చేత ఆడించడం గానీ,పాడించడం గానీ చేస్తారు.


2.పగడాల వాకిలి

  ఇందులో పొడుపు కథలు లేదా సామెతల వివరణ గానీ అడగటం జరుగుతుంది.


3.రతనాల ముంగిలి
 
    ఇందులో ఒక్కొక్కరికీ ఒక్కో చిత్రం చూపించి దానికి సంబంధించిన ప్రశ్న అడుగుతారు.

4.అందాల జాబిలి

     ప్రతీ ఒక్క అభర్ధి నాట్యం చేయాలి.

   అంతా బానే ఉంది.కానీ అభ్యర్ధుల చేత సమాధానాలు ఎలా అయినా చెప్పించాలని చిత్రలేఖ ప్రయత్నిస్తుంది.ఎన్నో ఆధారాలు ఇచ్చేస్తారు.చూసే వారికి ఎలా ఉంటుందంటే వారు చెప్పే సమాధానాలు స్వంతంగా చెప్పట్లేదేమో అనిపిస్తుంది.ఎలా అంటే అప్పటి వరకూ సమాధానాలు చెప్పనివాళ్ళు సడెన్ గా చెప్తారు.వీలైతే మీరూ చూడండి.మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి.
కిందవి సప్తగిరిలో ప్రసారమవుతున్న,అయిన కొన్ని కార్యక్రమాలు.


News&Views

Navya

Dharma sandehaalu

Raitu nestam

Manchi kutumbam with Dr.Garikipati Narasimhaarao

Telischool

Jaanapadaranjani

Healthy india

Maa ooru

Poota rekulu

Navya
                                                              

Saastra ..science quiz

Telugu totaVisakhadarsini

Ramani


2 కామెంట్‌లు:

  1. ఈ రోజుల్లో డిడి చూసే జనాలే కరువయ్యారు.

    రిప్లయితొలగించండి
  2. ​హాయ్ మోహన నిజంగా నీ బ్లాగ్ చాల బావుంది, సూక్ష్మంగా చెప్పాలంటే సంగీత రాగాలలో మోహన రాగం ఎంత ఉల్లాసభరితంగా ఉంటుందో అలా వుంది . దీర్గాయుష్మాన్భవ ..... ​    రిప్లయితొలగించండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...